హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
రొటీన్ గా మనం అన్ని రకాల వడ లు చేసుకుంటాము. కాని ఈరోజు మజ్జిగ తో వెరైటీగా మజ్జిగ వడలు తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి....
కావలసిన పదార్థాలు:
అటుకులు - ఒక కప్పు
బొంబాయి రవ్వ - అర కప్పు
మజ్జిగ - ఒక కప్పు
పచ్చిమిర్చి తరుగు ఒక స్పూన్
అల్లం తరుగు - ఒక స్పూను
ఎండు మిర్చి తరుగు కొద్దిగా బరకగా ఒక టీ స్పూను
నువ్వులు - ఒక టేబుల్ స్పూను,
కరివేపాకు
కొత్తిమీర తరుగు కొద్దిగా
జీలకర్ర - ఒక స్పూను
బియ్యప్పిండి - పావు కప్పు,
నూనె డీప్ ఫ్రై కి సరిపడా
ఉప్పు - రుచికి తగినంత
కొబ్బరి తురుము - ఒక స్పూన్
తయారుచేసే విధానం :-
- ముందుగా ఒక పది నిమిషాలు అటుకులను కొద్దిగా నీళ్ళు పోసి అందులో నానపెట్టాలి.
- ఇప్పుడు పెద్ద గిన్నె లో తడిపిన అటుకులు, ఉప్మా రవ్వ, ఉప్పు,
- మజ్జిగ కలిపి 20 నిమిషాలు పక్కనుంచాలి.
- తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి తురుము, నువ్వులు, ఎండు మిర్చి తరుగు వేసి బాగా కలిపి ముద్ద చేయాలి.
- మనము వడల కోసం పిండి ఎలా ఐతే కలుపుకుంటే బాగుంటుందో అలా కలపాలి.
- స్టౌ వెలిగించి బాణలి లో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి.
- పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుని వడలుగా ఒత్తినూనెలో దోరగా వేగించాలి.
- అంతే రుచికరమైన మజ్జిగ వడలు రెడీ..
- మజ్జిగ వడలు ఎలాంటి చట్నీ తో తిన్న చాలా రుచిగా ఉంటాయి.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: సేమియా పకోడీ / semiya pakodi
Post a Comment
If you have any doubts, Please let me know.