హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
రొటీన్ గా మనం అన్ని రకాల రైస్ వెరైటిలు చేసుకుంటాము. కాని ఈరోజు మనం టమాటో తో వెరైటీగా టమాటో రైస్ / టమాటో పులిహోర తయారు చేసుకుందాం. ఎక్కువ కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఇది చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి....
కావలసిన పదార్థాలు:-
బియ్యం : పావుకిలో
టొమాటోలు: పావుకిలో
చింతపండు గుజ్జు: టేబుల్ స్పూను
పచ్చిమిర్చి : ఆరు,
ఇంటువ : చిటికెడు
వేరు సెనగ పప్పు :3 టేబుల్ స్పూన్లు
సెనగపప్పు : 2టేబుల్ స్పూన్లు
మినపప్పు : 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
ఎండుమిర్చి :నాలుగు
ఆవాలు : టీస్పూను,
నూనె : 100 మి.లీ.
కరివేపాకు: నాలుగు రెబ్బలు
పసుపు : టీస్పూను.
తయారు చేసే విదానం :-
- టొమాటాలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి ఉడికించాలి.
- చాల్లారాక చింతపండు గుజ్జు చేర్చి మెత్తగా రుబ్బాలి.
- ఇప్పుడు కడాయిలో నూనె పోసి రుబ్బుకున్న మిశ్రమాన్ని పాచి వాసనా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
- అన్నం ఉడికించి పక్కన పక్కన పెట్టుకోవాలి.. వెడల్పాటి బాణలిలో ఉడికించిన అన్నంలో తగినంత ఉప్పు , టొమా టో గుజ్జు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
- బాణలిలో నూనె పోసి వేరుసనగ పప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించాలి.
- తరువాత కరివేపాకు కూడా వేసి వేగాక ఈ తాలింపును టొమాటో గుజ్జు కలిపిన అన్నంలో వేసి కలపాలి.
- అంతే రుచికరమైన టమాటో రైస్ /టమాటో పులిహోర రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: మజ్జిగ వడలు/ dahi vada/ perugu vada
Post a Comment
If you have any doubts, Please let me know.