బ్యూటీ టిప్స్/ Beauty Tips

 హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.

రొటీన్ గా మనం అన్ని రకాల వెరైటి వంటలు చేసుకుంటాము. కాని ఈరోజు మనం బ్యూటీ టిప్స్ నేర్చుకుందాం... ఎక్కువ ఇంట్లో ఉండే వాటితో ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.... తప్పకుండా ప్రయత్నించండి.... 

Beauty Tips


బ్యూటీ టిప్స్:-
పాదాల సంరక్షణ కోసం


గోరు వెచ్చని నీటిలో 2 స్పూన్ నిమ్మరసం, 2 స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ షాంపూని కలిపి పాదాలను అందులో పెట్టాలి. 

కాసేపటి తర్వాత పాదాలను బ్రష్ తో శుభ్రం చేసుకోవాలి.

ఇలా పలుమార్లు చేస్తే పాదాల నలుపు తగ్గుతుంది.


బ్యూటీ టిప్స్:-
అందానికి పెరుగు ప్యాక్....

1.పెరుగు ఆరోగ్యానికే కాదు అందానికి మేలు చేస్తుంది. దీనికోసం చెంచా పెరుగులో అరచెంచా తేనె కలిపి ముఖానికి రాయాలి.

తేనె సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఈ ప్యాక్ వేడికి పాడయిన చర్మానికి జీవం వచ్చేలా చేస్తుంది.


2.చెంచా చొప్పున పెరుగు, సెనగపిండీ కలిపి నీళ్లు చేర్చి మిశ్రమంలా చేయాలి.

దీన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత చన్నీళ్లతో

కడిగేయాలి. చెంచా ముల్తానీ మట్టిలో చెంచా పెరుగు వేసి కలపాలి.

దీనికి కొన్ని చుక్కల గులాబీ నీళ్లు కలిపి ముఖానికి ప్యాక్ లా వేయాలి.

మొటిమల నివారణకు ఈ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది.

3. అరటిపండును బాగా చిదిమి దానికి చెంచా చొప్పున పెరుగూ, సెనగపిండి, గుడ్డలోని తెల్లసొన చేర్చి ముఖానికి రాయాలి.

అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం కాంతితో మెరిసిపోతుంది.

4. చెంచా పెరుగులో రెండు చెంచాల ఓట్ మీల్ పౌడర్ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా రుద్దుతూ ఉండాలి. పావుగంట తరవాత చన్నీళ్లతో కడిగేస్తే సరి.ఈ ప్యాక్ ముఖానికి మెరుపునిస్తుంది.


తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.



0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️