హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
రొటీన్ గా మనం అన్ని రకాల వెరైటి వంటలు చేసుకుంటాము. కాని ఈరోజు మనం కొబ్బరి తో స్వీట్ ఎలా చేయాలో తెలుసుకుందాం.....కొబ్బరి బూరెలు ఎలా చేయాలో చూద్దాం......
కావలసిన పదార్థాలు:-
బియ్యం -1కిలో
బెల్లం - అర కిలో
కొబ్బరి చిప్పలు - 2
నెయ్యి 2 చెంచాలు
నువ్వులు100గ్రా
నూనె వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:-
- బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెట్టాలి.
- తర్వాత రోజు నీళ్లు ఒంపేసి, తడి పోయేదాకా ఆరబెట్టి
- పిండి చేసుకోవాలి.
- ఇప్పుడు కొబ్బరి తీసి సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
- స్టౌ వెలిగించి పాన్ లో బెల్లం వేసుకోని ఒక చిన్న టీ కప్పు నీళ్లు పోసి ముదురు పాకం( తీగ పాకం) పట్టాలి.
- పాకంలో నెయ్యి వేసి, కరిగాక కొబ్బరి వేసి కలిపాక, బియ్యం పిండి, నువ్వులు వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమం అరిసెల పిండి లా తయారవుతుంది.
- కొంచెం కొంచెం పిండి తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద చిన్న గా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించాలి.
- అంతే రుచికరమైన కొబ్బరి బూరెలు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: మజ్జిగ వడలు/ dahi vada/ perugu vada
Post a Comment
If you have any doubts, Please let me know.