హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
రొటీన్ గా మనం చపాతీలు చేసుకుంటాము. కాని ఈరోజు చపాతీ తో వెరైటీగా చపాతీ వెజ్ రోల్స్ తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి....
కావలసిన పదార్థాలు:-
చపా తీ పిండి
క్యాప్సికమ్ సగం కప్పు
టమాటోలు సగం కప్పు
బంగాళదుంపలు ఒక కప్పు
పచ్చి బటానీలు సగం కప్పు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి నాలుగు
మిరియాల పొడి కొద్దిగా
జీలకర్ర పొడి సగం స్పూన్
పసుపు - అర టీ స్పూన్
టమాటో కెచప్ - ఒక స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత
చిటికెడు కారం
తయారు చేసే విధానం:-
- ముందుగా చపాతీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- కావలసిన కూరగాయలను కావలిసిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి.
- అందులో ఆలు గడ్డ, బటానీలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- అన్ని వెజిటబుల్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే వెజ్ రోల్స్ కి బాగుంటాయి.
- కళాయిలో నూనె వేసి వేడెక్కాక తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
- తర్వాత క్యాప్సికమ్, టమాటోలను సన్నగా తరిగి వాటిని కూడా వేయించాలి.
- తర్వాత బంగాళదుంప ముక్కలు, బటానీలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి.
- చివరగా దించడానికి కొన్ని నిమిషాల ముందు జీలకర్ర పొడి,ఉప్పు, టమాటా కెచప్ వేసి ఉడికించాలి.
- అనంతరం చపాతీలను పెనంపై ఇరువైపులా కాల్చి.. కర్రీ వేడిగా ఉన్నప్పుడే చపాతీపై ఒకవైపు వేసుకుని రోల్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
- అంతే రుచికరమైన చపాతీ వెజ్ రోల్స్ రెఢీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: పెసరపప్పు పూర్ణాలు/moong dal sweet
Post a Comment
If you have any doubts, Please let me know.