హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా స్వీట్ లు చేసుకుంటుంటాం.మనం ఎప్పుడు సెనగపప్పు తో పూర్ణాలు చేసుకుంటాం. ఈరోజు వెరైటీగా ఎంతో రుచికరమైన ప్రసాదం పెసరపప్పు పూర్ణాలు తయారు చేసే పద్ధతి ......
కావలసిన పదార్థాలు :-
పెసరపప్పు
బెల్లం
బియ్యం
మినప్పప్పు
నూనె
తయారు చేసే విధానం :-
- ముందుగా బియ్యం ,మినప్పప్పు కడిగి నానపెట్టి మెత్తగా దోసల పిండి కొంచెం చిక్కగా (గట్టిగా) తయారు చేసుకోవాలి.
- ఇప్పుడు పెసరపప్పు ఉడికించి మెత్తగా మెదిపి పెట్టుకోవాలి .
- స్టౌ మీద కడాయి పెట్టి వేడి చేసి అందులో బెల్లం వేసి కరిగించి పెసరపప్పు ను వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- పెసరపప్పు,బెల్లం మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసుకొని వేడి చేసుకోవాలి.
- నూనె వేడయ్యాక చేసుకున్న పెసరపప్పు బెల్లం ఉండలను దోసల పిండి లో ముంచి పిండిలో పూర్ణాలు వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి.
- అంతే ఎంతో రుచికరమైన ప్రసాదం పెసరపప్పు పూర్ణాలు రెడి.
తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: రాజ్మా పన్నీర్ కర్రీ/ Rajma paneer curry
Post a Comment
If you have any doubts, Please let me know.