హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా పన్నీర్ కర్రీ చేసుకుంటుంటాం.ఈరోజు నోరూరించే ఎంతో రుచికరమైన రాజ్మా పన్నీర్ కర్రీ తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు :-
ఉడికించిన రాజ్మా
పన్నీర్
జీడిపప్పు పేస్ట్
ఎండుకొబ్బరి పేస్ట్
ఉల్లిపాయలు
టమాటాలు
నూనె
పోపు దినుసులు
పచ్చిమిర్చి
కరేపాకు
పసుపు
కొత్తిమీర
కారం
ఉప్పు
ధనియాలపొడి
అల్లంవెల్లుల్లి పేస్ట్
తయారు చేసే విధానం :-
- ముందుగా రాజ్మా ని ముందు రోజు రాత్రి నానపెట్టి కర్రీ చేసుకునే ముందు ఉడికించి పెట్టుకోవాలి.
- పన్నీర్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో ఎర్రగా ఫ్రై చేసి పెట్టుకోవాలి.
- ఇంకా జీడిపప్పు ,ఎందుకొబ్బరి ఫ్రై చేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి పోపు దినుసులు,ఉల్లిపాయలు ,టమాటాలు వేసి ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె పోసి పచ్చిమిర్చి ,కరేపాకు ,అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పసుపు,ఉల్లిపాయ,టమాటాల పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని ఉడికించిన రాజ్మా వేసుకొని ఫ్రై చేయాలి .
- ఇప్పుడు తగినంత ఉప్పు,కారం,వేసి జీడిపప్పు , ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి .
- ఐదు నిమిషాల తరువాత ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి ఒక రెండు నిముషాల తర్వాత కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే నోరూరించే ఎంతో రుచికరమైన రాజ్మా పన్నీర్ కర్రీ రెడి.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చేయండి.నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: పప్పు చారు (సాంబారు )/ Tasty sambaar
Post a Comment
If you have any doubts, Please let me know.