పప్పు చారు (సాంబారు )/ Tasty sambaar

హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.

మనం రకరకాలుగా సాంబారులు చేసుకుంటుంటాం.సాంబార్ లో క్యారెట్ముక్కలు,సొరకాయ మూకలు,మునక్కాయ ముక్కలు,దోసకాయ ముక్కలు వేసుకొని సాంబార్ తయరు చేసుకుంటారు.ఇంకా కొంత మంది వంకాయ,గుమ్మడికాయ కూడా వేసి సాంబార్ చేసుకుంటారు.అయితే ఈరోజు నోరూరించే వెరైటీ తెలంగాణ మునక్కాయ పప్పు చారు (సాంబారు) తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.

daal sambaar


కావలసిన పదార్థాలు :-

కందిపప్పు

చింతపండు రసం

జీలకర్ర

ఆవాలు

నూనె

కరేపాకు

మునక్కాయలు

టమోటాలు

పచ్చిమిర్చి

కొత్తిమీర

ఎండుమిర్చి రెండు

సాంబార్ పొడి

ఉప్పు

కారం

పసుపు

తయారు చేసే విధానం :-

  • ముందుగా కందిపప్పుని కడిగి కుక్కర్లో వేసి ఉడికించుకొని పెట్టుకోవాలి.కావలసిన పదార్థాలు అన్ని సిద్దం చేసుకొని కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలి.

  • చింతపండు నానపెట్టి రసం తీసి పెట్టుకోవాలి.మునక్కాయలు కట్ చేసి పెట్టుకోవాలి.

  • ఇప్పుడు స్టౌ వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి జీలకర్ర ,ఆవాలు ,పచ్చిమిర్చి,పసుపు ,మునక్కాయల ముక్కలు ,టమోటాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి.

  • ఇప్పుడు కారం ,ఉప్పు వేసి చింతపండు రసం పోసి తగినన్ని నీళ్లు పోసి మరిగించుకోవాలి.

  • మరుగుతున్న చింతపండు రసంలో ఉడికించుకున్న పప్పు ను వేసుకోవాలి.ఇంకా కొద్దీ సేపు మరిగించాలి మరిగిన తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలి.

  • చివరగా కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.అంతే వెరైటీ తెలంగాణ పప్పు చారు (సాంబారు) రెడీ.

  • తప్పకుండా ప్రయత్నించండి. లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️