గోబీ పకోడీ/cauliflower pakodi

 హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.

ఈరోజు మనం తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.టేస్టీ గా వెరైటీగా గోబీ పకోడీ తయారి విధానం..

Cauliflower pakodi

కావలసిన పదార్థాలు:-

క్యాలీఫ్లవర్

సెనగపిండి

ఉప్పు

కారం

చిటికెడు వంటసోడా

పసుపు చిటికెడు

వాము

తయారు చేసే విధానం:-

  • ముందుగా కాలిఫ్లవర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కడిగి పెట్టుకోవాలి.
  • చిటికడు ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి సగం ఉడికించి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక గిన్నెలో పకోడీలు చేసుకోవడానికి శెనగపిండి, కారం, ఉప్పు తగినంత,నీరు తగినన్ని, చిటికెడు పసుపు, వాము ,చిటికెడు వంటసోడా వేసి బాగా కలుపుకోవాలి.
  • కలిపిన పిండిలో ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడి చేసుకోవాలి నూనె కాగాక అందులో పకోడీలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి.
  • అంతే రుచికరమైన కాలీఫ్లవర్ పకోడీలు రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

Also read: కంది పచ్చడి (kandi pachadi)

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️