హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా పచ్చడి లు చేసుకుంటుంటాం.
మనం రోజు చాల రకాల పచ్చడ్లు చేసుకుంటాం.టమాటో,కాప్సికం,దోసకాయ,దొండకాయ,ఎలా ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంటాం.ఈరోజు నోరూరించే కంది పచ్చడి తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు :-
కందిపప్పు
పచ్చిమిర్చి
కొద్దిగా చింతపండు
వెల్లుల్లి
కొద్దిగా పల్లీలు
నువ్వులు
కరేపాకు
నూనె
జిలకర
ఆవాలు
ఎండుమిర్చి
మినప్పప్పు
పసుపు
ఒక టమటా
తయారు చేసే విధానం :-
- కంది పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలన్నీ తయారు చేసి పెట్టుకోవాలి.
- ముందుగా స్టౌ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి వరుసగా పచ్చిమిర్చి ,వెల్లుల్లి ,టమటా ,పల్లీలు ,నువ్వులు వేయించి పెట్టుకోవాలి.
- అలాగే అదే కడాయిలో కందిపప్పు,టొమోటో లను కూడా వేసి వేయించుకోవాలి.
- ఫ్రై చేసిన అన్నింటిని పక్కన పెట్టి చల్లర్చుకోవాలి.అలాగే చింతపండు నానపెట్టుకోవాలి.
- అన్నింటిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా చింతపండు ,తగినంత ఉప్పు వేసి రుబ్బుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద చిన్న కడయి పెట్టుకొని పోపు పెట్టుకోవాలి.కడాయి లో నూనె, జిలకర, ఆవాలు, మినప్పప్పు,ఎండుమిర్చి,కరేపాకు,పసుపు వేసి వేయించుకొని పచ్చడిలో వేసుకోవాలి.
- అంతే నోరూరించే కంది పచ్చడి రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.