హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం
ఈరోజు మనం రెడ్, యెల్లో, గ్రీన్ కప్సికమ్స్ తో రైస్ తయారు చేసే విధానం నేర్చుకుందాం. ఎంతో రుచిగా ఉండే రంగుల క్యాప్సికమ్ రైస్ ( మల్టీ కలర్ కాప్సికం రైస్ )తయారు చేసే పద్ధతి.
కావలసిన పదార్థాలు:-
ఉడికించిన అన్నం రెండు కప్పులు
నూనె
పోపు గింజలు
ఉల్లిపాయ లు
అల్లం వెల్లుల్లి పేస్ట్
పచ్చి మిర్చి
పచ్చి బఠాణీ
టొమాటో గుజ్జు అరకప్పు
రెడ్ క్యాప్సికమ్ ముక్కలు
యెల్లో క్యాప్సికమ్ ముక్కలు
గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు
ఒక స్పూన్ కారం
కొద్దిగా ధనియాల పొడి
కొద్దిగా గరం మసాలా
ఉప్పు
పసుపు చిటికెడు
కొత్తిమీర
కరేపాకు
తయారు చేసే విధానం:-
- కాప్సికం కడిగి మనకు కావలసిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి.అలాగే మిగత కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి.
- ముందుగా కడాయి లో కొద్దిగా నూనె పోసి కాగిన తరువాత పోపు గింజలు వేసి వేయించుకోవాలి.
- ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరేపకు అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
- తర్వాత అందులో అన్ని రకాల క్యాప్సికమ్ ముక్కలు,బఠాణీ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. టొమాటో గుజ్జు వేసి వేయించుకోవాలి.
- రెండు నిమిషాల తరువాత అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి.అన్నం వేడి అయ్యేక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే రుచికరమైన వంటకం క్యాప్సికమ్ రైస్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: వంకాయ బోటి కూర / brinjal mutton boti curry
Post a Comment
If you have any doubts, Please let me know.