హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
వంకాయ బోటి కూర;-
బోటి అందరికి చాల ఇష్టం చాలా వరకు అందరు దిన్ని వేరే కూరగాయలతో కలపకుండా వండుతారు.కొందరు బోటి తో చారు చేస్తారు .మరి కొందరు ఫ్రై చేస్తారు .మరికొందరు కుర చేస్తారు.ఇది ఆరోగ్యానికి కూడా చాల మంచింది.మనం ఈరోజు వంకాయతో రుచికరమైన వంకాయ బోటి కూర తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు :-
నూనె
జిలకర్ర
ఆవాలు
ఉల్లిపాయలు
కొత్తిమీర
ఉప్పు
పసుపు
తగినన్ని నీళ్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్
కారం
వంకాయ ముక్కలు
ఉడికించిన బోటి
పుదీనా
ధనియాలపొడి
గరం మసాలా
తయారు చేసే విధానం :-
ముందుగా బోటి ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఉప్పు ,పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌ వెలిగించి గిన్నె పెట్టి తగినంత నూనె పోసి ఆవాలు,జిలకర ,ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.
ఉల్లిపాయలు ఎర్రగా ఐన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పసుపు వేసుకొని ఇప్పుడు ఉడికించిన బోటి వేసుకొని ఐదు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
ఆ ఆతర్వాత వంకాయ ముక్కలు వేసి కాసేపు మగ్గించుకోవాలి.
ఇప్పుడు తగినంత ఉప్పు, కారం వేసి ఇంకో పది నిముషాలు ఉడికించుకోవాలి .
గ్రేవీ కావాలనుకుంటే తగినన్ని నీళ్లు పోసుకోవాలి.లేదు ఫ్రై అనుకుంటే వాటర్ అవసరం లేదు .
ఇప్పుడు చివర గా ధనియాల పొడి,గరం మసాలా ,పుదీనా ,కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
అంతే రుచికరమైన వంకాయ బోటి కూర రెడీ.
ఇది చపాతీ ,పూరి,అన్నంలోకి చాల బాగుంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: క్యాప్సికమ్ పచ్చడి / Capsicum chutney
Post a Comment
If you have any doubts, Please let me know.