హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు క్యాప్సికమ్ పచ్చడి తయారు చేసుకుందామా.
కావలసిన పదార్థాలు:-
క్యాప్సికమ్
పచ్చిమిర్చి
జీలకర్ర
నూనె
పల్లీలు
నువ్వు లు
కొద్దిగా చింతపండు
ఒక టొమాటో
ఒక ఉల్లిపాయ
ఐదారు వెల్లుల్లి
పసుపు
ఉప్పు
పోపు దినుసులు
కరెపాకు
తయారు చేసే విధానం:-
- క్యాప్సికమ్ పచ్చడి చేసుకోవడానికి కావలిసన వెజిటబుల్స్ మసాలా లు సిద్ధం చేసి పెట్టుకోవాలి.
- క్యాప్సికం, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి లను కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టీ పల్లీలు ,నువ్వులు వేసి వేయించుకోవాలి.వాటిని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్ లో నూనె పోసి కాగిన తరువాత అందులో కొద్దిగా జీలకర్ర,క్యాప్సికం, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు , పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలిపి మూత పెట్టీ బాగా ఉడికించుకోవాలి.
- ఇప్పుడు మిక్సి లో పల్లీలు నువ్వులు వేసి పొడి చేసుకోవాలి.
- తర్వాత అందులో ఉడికిన క్యాప్సికం, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ,చింతపండు , వెల్లుల్లి, తగినంత ఉప్పు వేసి రుబ్బు కొని ఒక గిన్నలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద బాణలి ఉంచి అందులో కొద్దిగా నూనె పోసి కాగిన తరువాత అందులో పోపుదినుసులు, జీలకర్ర, ఆవాలు,సెనగపప్పు, ఎండుమిర్చి, మినప్పప్పు, కరెపకు వేసి వేయించుకోవాలి.
- ఇప్పుడు ఆ పోపు నీ పచ్చడి లో వేసి బాగా కలుపుకోవాలి.
- అంతే రుచికరమైన క్యాప్సికమ్ పచ్చడి రెడీ.
- ఇది దొసలలోకి చాలా బాగుంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: వెజిటబుల్ కిచిడి (Vegetable Khichidi)
Post a Comment
If you have any doubts, Please let me know.