దోసకాయతో పచ్చడి /dosakaya pachadi

హాయ్ ఫ్రెండ్స్
అందరికి నమస్కారం,

అందరికీ అందుబాటులో ఉండే దోసకాయతో పచ్చడి తయారు చేసే విధానం నేర్చుకుందాం. దోసకాయ శరీరంలో వేడి కొంత వరకు తగ్గిస్తుంది. ఆరోగ్యానికీ మంచిది.
Dosakaya pachadi

కావలసిన పదార్థాలు:-

గట్టిగా ఉన్న దోసకాయ

పచ్చి మిర్చి

నువ్వులు రెండు స్పూన్లు

పల్లిల్లు

ఉప్పు

వెల్లుల్లి

కొత్తిమీర

కరిపాకు

ఎండుమిర్చి

మినప్పప్పు ఒక స్పూన్

జీలకర్ర

ఆవాలు

నూనె

ఒక టొమాటో

చింతపండు ఒక రెండు మూడు రెబ్బలు

తయారు చేసే విధానం:-

  • దోసకాయ పైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఒక కడాయి పెట్టి కొద్దిగా నూనె పోసి కాగిన తర్వాత జీలకర్ర, దోసకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
  • కాసేయ్యాక టమోటా ముక్కలు, చింతపండు, వెల్లుల్లి, కరేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి దోసకాయ ముక్కల ను చల్లారనివ్వాలి.
  • మరొక కడాయి లో పల్లిలు, నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు,నువ్వులు వేసి పొడి చేసుకోవాలి.
  • తర్వాత వేయించుకున్న దోసకాయ ముక్కలు అన్ని వేసి తగినంత ఉప్పువేసి రుబ్బుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద బాణలి ఉంచి అందులో ఒక రెండు స్పూన్లు నూనె పోసి కాగిన తరువాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరేపాకు, సెనగపప్పు, మినపప్పు, పసుపు వేసుకోవాలి.
  • పోపు ని పచ్చడిలో కలుపుకోవాలి.
  • అంతే రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

Also read: వెజిటబుల్ కిచిడి (Vegetable Khichidi)

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️