హయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
ఈరోజు మనం పొట్లకాయ ఎండుకొబ్బరి కుర్మా తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం...
కావలసిన పదార్థాలు :-
పొట్లకాయలు
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
టమోటో (పేస్ట్)
నూనె
పోపు దినుసులు
వెల్లుల్లి (5,6)
పసుపు
ఎండుమిర్చి
ఎండుకొబ్బరి పేస్ట్
కారం
ఉప్పు
కొత్తిమీర
తయారు చేసే విధానం :-
- ముందుగా పొట్లకాయలను కడిగి గుండ్రంగా రింగులలాగా కట్ చేసి పెట్టుకోవాలి.
- ఎండుకొబ్బరి ముక్కలు చేసి వాటిని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్ప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టాలి.కొంచెం వేడయ్యాక అందులో తగినంత నూనె పోయాలి.
- నూనె కొంచెం వేడయ్యాక పోపు దినుసులు ,ఎండుమిర్చి, వెల్లులి, పసుపు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి.
- ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పొట్లకాయ ముక్కలను వేసి బాగా కలపాలి.
- సన్నని మంట మీద కాసేపు మగ్గనివ్వాలి.ఆ తర్వాత కారం ,ఉప్పు తగినంత వేసుకోవాలి.
- ఇప్పుడు బాగా కలుపుకోవాలి.రెండు నిమిషాల తర్వాత టమోటో పేస్ట్ వేసి కాసేపు ఉడికించాలి.
- ఉడికిన తరువాత తయారు చేసుకున్న ఎండుకొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక 10 నిముషాలు ఉడికించాలి.
- చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే పొట్లకాయ కుర్మా రెడి.
- ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాల రుచిగా ఉంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి. మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: వెజిటబుల్ కిచిడి (Vegetable Khichidi)
Post a Comment
If you have any doubts, Please let me know.