కచోరిలు / kachorilu

హయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనకు బయట దొరికే కచొరి లాంటి కచోరీ తయారి విధానం నేర్చుకుందాం.



కావలసిన పదార్ధాలు:-

ఆలూ

మైదా

ఉప్మా రవ్వ కొద్దిగా ఇక రెండు స్పూన్లు

నూనె

వాము

కారం

ఉప్పు

ధనియాల పొడి

గరమసాల

జీలకర్ర

పసుపు

కొత్తిమీర

తయారు చేసే విధానం:-

  • ముందుగా ఒక గిన్నలో ఒక కప్పు మైదా, రెండు స్పూన్లు ఉప్మా రవ్వ, కొద్దిగా ఉప్పు ,రెండు మూడు స్పూన్ల నూనె కొద్దిగా వాము వేసి కలపాలి.
  • ఈ మిశ్రమం చేతితో తీసుకొని ముద్దలా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి.
  • తర్వాత తగినన్ని నీళ్ళు పోసి పిండి ముద్దలా కలిపి మూత పెట్టుకోవాలి.
  • ఈ పిండిని అర గంట పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఆలుగడ్డ ఉడికించి మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత స్టౌ వెలిగించి గిన్నె పెట్టీ అందులో నూనె పోసి కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర అన్ని వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు ఆలూ వేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోనీ స్టౌ ఆఫ్ చేయాలి.
  • ఇప్పుడు చల్లారనివ్వాలి. స్టౌ వెలిగించి కళాయి లో నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఇప్పుడు కొద్దిగా పిండి ముద్ద తీసుకుని అందులో ఆలూ మిశ్రమం పెట్టీ చక్కగా బైటికి రాకుండా మూసి కచొరీ లా చేసుకొని పెట్టుకోవాలి.
  • స్టవ్ వెలిగించి బాణలి లో నూనె వేడి చేసుకొని కచోరి వేసుకోని చిన్న మంట మీద నెమ్మదిగా రెండు వైపుల నుండి కాల్చుకోవాలి.
  • అంతే రుచికరమైన కాచోరి రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

Also read: వెజిటబుల్ కిచిడి (Vegetable Khichidi)

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️