సెనగపప్పు ఉల్లిపాయల కూర / senagapappu onion curry

హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా ఉల్లిపాయల కూరలు చేసుకుంటుంటాం.

ఈరోజు నోరూరించే ఎంతో రుచికరమైన సెనగపప్పు ఉల్లిపాయల కూర తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.

Onion senagapappu curry


కావలసిన పదార్థాలు :

ఉల్లిపాయలు (ఉల్లికాడలు )

నూనె

జిలకర

ఆవాలు

ఎండుమిర్చి

కరేపాకు

సెనగపప్పు

ఒక టమాటో

పసుపు

తగినంత ఉప్పు

కారం

ఎండుకొబ్బరి పొడి

ధనియాల పొడి

అల్లం వెల్లుల్లి పేస్ట్

కొత్తిమీర


తయారు చేసే విధానం :-

  • ముందుగా స్టౌ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి జీలకర్ర ,ఆవాలు ,ఎండుమిర్చి ,కరేపాకు,తరిగిన ఉల్లిపాయలు( ఉల్లికాడలు కూడా వేసి చేసుకోవచ్చు ),అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పసుపు ఒక దాని తర్వాత ఒకటి వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి.ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి.
  • తర్వాత సెనగపప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత తగినంత ఉప్పు,కారం ,ఎండుకొబ్బరి పొడి ,ధనియాల పొడి వేసి వేయించుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఒక పది నిముషాలు ఉడికించుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన సెనగపప్పు ఉల్లిపాయల కూర రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.

మీకు నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️