హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు స్వీట్ సాస్ తయారి విధానం నేర్చుకుందాం.
స్వీట్ సాస్:-
స్వీట్ సాస్, స్వీట్ చట్నీ అందరికీ చాలా ఇష్టం. ఇది మనం ఎక్కువగా ఎగ్ పఫ్, కర్రీ పఫ్, సమోసా,పాని పూరి లోకి ఎక్కువ తింటూ ఉంటాం. స్వీట్ షాప్ లో వాడే స్వీట్ సాస్ , స్వీట్ చట్నీ తయారి విధానం నేర్చుకుందాం......
కావలసిన పదార్థాలు:-
చింతపండు గుజ్జు అరకప్పు
నీళ్లు ఒక కప్పు
మైదా ఒక స్పూన్ లేదా కార్న్ ఫ్లోర్
చెక్కర లేదా బెల్లం పావు కప్పు
చిటికెడు ఆరంజ్ ఫుడ్ కలర్
తయారు చేసే విధానం:-
- చింతపండు నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
- బెల్లం తురిమి ఒక గిన్నెలో వేసుకుని ఉంచుకోవాలి
- స్టౌ వెలిగించి పాన్ లో ఒక కప్పు నీళ్లు పోసి కాగిన తరువాత అందులో కొద్దిగా చింతపండు రసం వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు తగినంత బెల్లం వేసి బాగా కలపాలి.
- బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలి.
- తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ లేదా మైదా నీ కొద్దిగా నీళ్లలో ఉండలు లేకుండా కలిపి చింతపండు, బెల్లం మిశ్రమం లో వేసి కలపాలి.
- ఆ తర్వాత చిటికెడు ఆరంజ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి.
- కొద్దిగా చిక్కపడే వరకు ఉడికించి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- ఎక్కువ చిక్కగా చేయకూడదు. అలా చేస్తే చల్లబడ్డకా ఇంకా చిక్కగా అవుతుంది.
- అంతే రుచికరమైన స్వీట్ సాస్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: క్రిస్పీ ఆలూ పకోడీ / crispy potato pakoda
Post a Comment
If you have any doubts, Please let me know.