క్రిస్పీ ఆలూ పకోడీ / crispy potato pakoda

హాయ్ ఫ్రెండ్స్
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం ఆలూ పకోడి తయారు చేయడం నేర్చుకుందాం.

ఆలూ పకోడీ:-

రొటీన్ గా మనం ఉల్లిపాయలతో పకొడిలు చేసుకుంటాము. కాని ఈరోజు ఉల్లిపాయలతో కాకుండా వెరైటీగా ఆలూ పకోడి తయారు చేసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి.

 

Grated potato pakodi

కావలసిన పదార్థాలు:-

ఆలూ

సెనగపిండి

పసుపు

కారం

ఉప్పు

కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్

కొత్తిమీర

కరెపకు

నూనె

చిటికెడు వాము

తయారు చేసే విధానం:-

  • పకోడిలు చేయడానికి కావలసిన పదార్థాలు అన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి.
  • ముందుగా ఆలూ నీ సన్నగా తురుముకోవాలి. కొబ్బరి కోరు చేసుకునే పిటలో తురుముకోవాలి. ముక్కలుగా కట్ చేయకూడదు.
  • కట్ చేస్తే పకోడీ సరిగా రాదు.
  • ఇప్పుడు ఆలూ తురుమును ఒక గిన్నె లో తీసుకొని అందులో కారం,పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, వాము ,కొత్తిమీర, కరెపకు, సెనగపిండి వేసుకొని అన్ని కలిసేలా బాగా పకోడి పిండి లా కలుపుకోవాలి.
  • నీళ్ళు అవసరం లేదు కావాలంటే కొద్దిగా చల్లుకోవాలి. 
  • ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె వేడి చెయ్యాలి.
  • నూనె వేడి అయ్యాక పిండి తో పకోడీలు వేసుకోవాలి.
  • వాటిని రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి.
  • అంతే రుచికరమైన ఆలూ పకోడి రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.

నచ్చితే ఫాలో అవ్వండి.

Also read: ఇడ్లీ రవ్వ తో ఉప్మా / Idly ravva upma

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️