ఎగ్ మసాలా కూర/ steamed egg masala curry

 హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.

ఎగ్ అందరికీ ఇష్టమైన వంటకం. ఎగ్ తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. కర్రీ, ఫ్రై, పులుసు ఇలా చాలా రకాలు. అయితే ఈరోజు మనం ఆవిరి గుడ్డు మసాలా కూర తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం....

Egg masala curry

కావలసిన పదార్థాలు:-

ఎగ్స్

ఉల్లిపాయలు

పచ్చి మిర్చి

టొమాటో ముక్కలు

నూనె

జీలకర్ర

కరిపాకు

కొత్తిమీర

ధనియాల పొడి

గరం మసాలా

జీడిపప్పు

ఎండుకొబ్బరి

కారం

ఉప్పు

పసుపు

అల్లం వెల్లుల్లి పేస్ట్

మిరియాలపొడి

తయారు చేసే విధానం:-

  • ముందుగా ఎగ్స్ కొట్టి పోసి అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కొద్దిగా వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న కటోరి లో వేసి ఇడ్లీ గిన్నెలో నీళ్లు పోసి కాగిన తర్వాత అందులో పెట్టీ ఉడికించాలి.
  • ఉడికించిన గుడ్డును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • తర్వాత ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగాక అందులో ఉల్లిపాయలు, టొమాటో, జీడిపప్పు,ఎండు కొబ్బరి, పచ్చి మిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి కాగాక అందులో జీలకర్ర ,ఎండుమిర్చి,కరివేపాకు తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి.
  • ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టీ ఒక పావు గంట సేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
  • తర్వాత అందులో ఉడికించిన గుడ్డును, కారం తగినంత, ఉప్పు వేసి, మూత పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉడికిచండి.
  • చివరకు ధనియాల పొడి, గరం మసాలా ,కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి.
  • అంతే రుచికరమైన ఆవిరి గుడ్డు మసాలా కూర రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

Also read: పప్పు చారు (సాంబారు )/ Tasty sambaar

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️