హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం పాలకూర చింతకాయ పప్పు తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
పాలకూర పప్పు:-
పప్పు చాలా రకాలు గా చేసుకుంటాము. చాలా రకాల కూరగాయలతో కలిపి చేసుకుంటాము. పాలకూర పప్పు , దోసకాయ పప్పు…... పాలకూర పప్పు చింతకాయ తో చేసుకుందాము….
కావలసిన పదార్థాలు:-
చింతకాయ ముక్కలు అర కప్పు
కంది పప్పు 1 కప్పు
పాలకూర ఒక కట్ట
ఉల్లిపాయ 1 (సన్నగా తరిగాలి)
నూనె నాలుగు స్పూన్లు
పచ్చిమిర్చి నాలుగు
ఎండుమిర్చి రెండు
వెల్లుల్లి నాలుగు
కరివేపాకు
ఉప్పు తగినంత
జీలకర్ర
ఆవాలు
ఇంగువ చిటికెడు
కొత్తిమీర తగినంత
కారం తగినంత
ఉప్పు
తయారు చేసే విధానం:-
ముందుగా పాత్రలో కప్పు నీళ్లు పోసి చింతకాయ
ముక్కలు వేసి మెత్తగా ఉడకబెట్టి, మెదుపుకోవాలి.
మెదిగిన చింతకాయ ముక్కలను గట్టిగా పిండేసి, రసం తీసుకోవాలి.
కుక్కర్ లో రెండు కప్పుల నీళ్లు పోసి కంది
పప్పు, పాలకూర, పచ్చిమిర్చి వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి.
పాత్రలో నూనె వేడయ్యాక ఆవాలు,జీలకర్ర, ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేవరకు
వేయించాలి.
ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
తగినంత కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి సరిపడా వేసుకుంటే కారం అవసరం లేదు.
ఉడకబెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని పోపులో పోసి, చింతకాయ గుజ్జు, ఉప్పు,నీటిని అందులో కలిపి, పదిహేను నిమషాలు మరిగించాలి.
సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి వడ్డించాలి.
అంతే రుచికరమైన పాలకూర చింతకాయ పప్పు రెడీ. చాలా రుచిగా ఉంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: రొయ్యల వేపుడు / prawns fry
Post a Comment
If you have any doubts, Please let me know.