హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం చికెన్ కబాబ్ తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
చికెన్ కబాబ్:-
కావలసిన పదార్థాలు:-
బోన్ లెస్ చికెన్ అర కిలో
నిమ్మ రసం
పచ్చిమిర్చి
అల్లం వెల్లుల్లి పేస్ట్
గట్టి పెరుగు ఒక కప్పు
గరంమసాలా పొడి ఒక స్పూను
నూనె సరిపడా
కొత్తిమీర
పుదీనా
ఉప్పు సరిపడా
పసుపు చిటికెడు
తయారు చేసే విధానం:-
చికెన్ కబాబ్ కి కావలసిన పదార్ధాలు అన్ని సిద్దం చేసుకోవాలి.
కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు అన్నీ కలిపి
మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో చికెన్ వేసుకొని చాకుతో లోతుగా గంట్లు పెట్టి కొద్దిగా నిమ్మరసం ,ఉప్పు, పసుపు,అల్లం వెల్లుల్లి ముద్దని బాగా పట్టించి పావుగంట సేపు నానివ్వాలి.
పెరుగు బాగా చిలికి ఉప్పు, గరం మసాలా పొడి, నూనె వేసి బాగా కలిపి చికెన్ ముక్కలను అందులో వేసి ఆరుగంటలపాటు ఊరనివ్వాలి.
తరువాత చికెన్ ముక్కల్ని బొగ్గుల సెగమీద దోరగా
కాల్చాలి.
ఆపై వీటిని ఒక ప్లేటులో పెట్టి చాట్ మసాలా
పొడి చల్లి, ఉల్లిపాయ చక్రాలూ నిమ్మకాయ ముక్కలతో అందంగా అలంకరించి అతిథులకు వడ్డించాలి.
ఈ చికెన్ కబాబ్ వేడి వేడిగా తింటే చాలా రుచిగా
ఉంటాయి.
అంతే రుచికరమైన చికెన్ కబాబ్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: రొయ్యల వేపుడు / prawns fry
Post a Comment
If you have any doubts, Please let me know.