టొమాటో సోయా( మిల్మెకర్) కర్రీ / tomato soya (milmekar) curry

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం టొమాటో సోయా కర్రీ తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

Tomato soya curry

కావలసిన పదార్థాలు:-
 

నానబెట్టిన సోయా(మిల్మేకర్ ) - కప్పు

టొమాటో తరుగు - కప్పు

నూనె - 3 టేబుల్ స్పూన్లు

క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు

ఉల్లిపాయ ముక్కలు అర కప్పు,

పుదీనా ఆకులు 

వెల్లుల్లి రేకలు 3

పచ్చిమిర్చి 

జీడిపప్పు పలుకులు - 10

బాదంపప్పులు - 6

పసుపు

కారం

గరంమసాలా

కొత్తిమీర - కొద్దిగా

 

తయారు చేసే విధానం:-

 

  • ఒక పెద్ద పాత్రలో మిల్మేకర్ వేసి నీళ్ళు పోసి నానపెట్టుకోవలి.
  • బాణలిలో టేబుల్ స్పూను నూనె కాగాక, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి.
  • పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు, బాదంపప్పు,వేసి రంగు మారే వరకు వేయించాలి.
  • వేయించిన అన్ని చల్లార్చి మిక్సి లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు అదే కడాయిలో నూనె పోసి కాగిన తరువాత ఉల్లితరుగు వేసి వేయించాక,టొమాటో తరుగు వేసి బాగా కలపాలి.
  • బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగించాలి.
  • తర్వాత మీల్ మేకర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • దానికి సరిపడా కారం, ఉప్పు, ధనియాలపొడి, గరంమసాలా వేసి బాగా కలపాలి.
  • ముందుగా చేసి ఉంచు కున్న పేస్ట్ వేసి రెండు నిముషాలు ఉడికించాలి.
  • కొద్దిగా నీరు జతచేసి ఐదు నాలుగైదు నిముషాలు
  • ఉడికించి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
  • అంతే రుచికరమైన సోయా టొమాటో కర్రీ రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️