వంకాయ ఆలుగడ్డ కూర / Brinjal potato curry

 హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం వంకాయ ఆలుగడ్డ కూర తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

Brinjal potato curry

కావలసిన పదార్థాలు:-

వంకాయలు

ఉల్లిపాయలు

టమాటాలు

ఆలుగడ్డ

నూనె

జీలకర్ర

ఆవాలు

కరేపకూ

కొత్తిమీర

ఎండు కొబ్బరి కోరు

ధనియాల పొడి

ఉప్పు తగినంత

కారం

పసుపు

అల్లం వెల్లుల్లి పేస్ట్

తయారు చేసే విధానం:-

  • ముందు గా వంకాయ, ఆలుగడ్డ కావలసిన సైజ్ లో కట్ చేసి ఉప్పు నీళ్లలో వేయాలి.
  • ఉప్పు నీళ్లలో వేయకపోతే గాలికి వంకాయ, ఆలు గడ్డ ముక్కలు నల్లగా మారిపోతాయి.
  • అలాగే ఉల్లిపాయ ముక్కలు,ఇంకా కావలసిన అన్ని తయారు చేసి పెట్టుకోవాలి.
  • స్టౌ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసి కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించాలి.
  • ఒక నిమిషం ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేసి వేయించుకోవాలి.
  • తర్వాత టొమాటో ముక్కలు వేసి మగ్గించుకోవలి.
  • వేగిన తరవాత వంకాయ ,ఆలుగడ్డ ముక్కలను వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
  • కొంచెం ఉడికిన తరువాత ఉప్పు, కారం తగనంత వేసి అందులో తగినన్ని నీళ్ళు పోసి దానిపై మూత పెట్టుకోవాలి.
  • ఇప్పుడు పది నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి.
  • ఉడికిన తరువాత ధనియాల పొడి, ఎండు కొబ్బరి కోరు, కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు అలాగే స్టౌ మీద ఉంచి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే రుచికరమైన వంటకం వంకాయ ఆలుగడ్డ కూర రెడీ.
  • ఇది అన్నంలోకి ,పురిలోకి చాలా రుచిగా ఉంటుంది.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చేయండి.నచ్చితే ఫాలో అవ్వండి.

Also read: రొయ్యల వేపుడు / prawns fry

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️