హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం రెండు రకాల టీ ఎలా చేయాలో, తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
టీ (TEA):-
టీ అంటే అందరికీ చాలా చాలా ఇష్టం. ఎవరు మన ఇంటికి వచ్చిన అంటే బంధువులు స్నేహితులు మరియు తెలిసిన వారు పక్కింటి వారు ఇలా ఎవరూ వచ్చిన తప్పకుండా చేసే మర్యాద టీ ఇవ్వడం. టీ అందరూ తాగుతారు. కాకపోతే టీ లో చాలా రకాల టీ లు చేసుకుంటాము…. అందులో గ్రీన్ టీ, అల్లం టీ ఎలా చేయాలో చూద్దాం…..
కావలసిన పదార్థాలు:-
పాలు రెండు గ్లాసులు
పంచదార నాలుగు స్పూన్లు
టీ పొడి ఒక స్పూన్
ఇలాచి ఒకటి
అల్లం చిన్న ముక్క
నీళ్లు గ్లాసు
తయారు చేయు విధానం:-
- స్టౌ వెలిగించి గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని టీ పొడి నాలుగు స్పూన్లు చక్కెర వేసి మరిగించాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో రెండు గ్లాసుల పాలు పోసుకోవాలి.
- ఇప్పుడు అల్లం చిన్న ముక్క తీసుకుని దాన్ని చిన్న రోట్లో వేసుకొని నలగ్గొట్టి టీ లో వేసుకోవాలి.
- అలాగే ఒక ఇలాచీ కూడా నలగొట్టి పొట్టుతో సహా వేయాలి.
- ఒక ఐదు నిమిషాలు మారిగించుకోవాలి.
- టీ రంగు మారేవరకు మరిగించుకోవాలి.
- అంతే రుచికరమైన అల్లం టి రెడీ.
గ్రీన్ టీ( Green Tea):-
కావలసిన పదార్థాలు:-
పావుటీస్పూన్ గ్రీన్ టీ పౌడర్
పూదీన ఆకులు నాలుగు
పంచదార ఒక స్పూన్
కప్పు నీళ్ళు
కొద్దిగా నిమ్మరసం
తయారు చేయు విధానం:-
- ఒక గిన్నెలో కప్పు నీళ్ళువేసి మరిగించి దించి అందులో పుదీనా ఆకులు, గ్రీన్ టీ పౌడర్ ,పంచదార, వేసిమూతపెట్టాలి.
- ఈ మిశ్రమాన్ని గ్లాస్ లో పోసి సర్వ్ చేయాలి. (చెక్కర వద్దనుకునే వారు చెక్కర బదులు నిమ్మరసం వేసుకోవోచ్చు).
తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: వంకాయ ఆలుగడ్డ కూర/Brinjal potato curry
Post a Comment
If you have any doubts, Please let me know.