వెజిటబుల్ కిచిడి (Vegetable Khichidi)

హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.


మనం రకరకాలుగా కిచిడిలు చేసుకుంటుంటాం. ఈరోజు వెరైటీ రుచికరమైన వెజిటబుల్ కిచిడి తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.

Vegetable Khichidi


కావలసిన పదార్థాలు :-


క్యారట్ 

బీన్స్

వంకాయ 

ఆలుగడ్డ 

పచ్చి బఠాణీలు 

పెసరపప్పు 

పచ్చి మిర్చి

బియ్యం 

కొత్తిమీర 

నీళ్లు (ఒకటికి నాలుగింతల నీళ్లు లేదా అన్ని వెజిటబుల్స్ మునిగే వరకు పోయాలి ).

ఉప్పు 

జీలకర్ర 

మిరియాలు 

వాము 

కరేపాకు 

పసుపు 

ఇంగువ 

నూనె 

నెయ్యి


తయారు చేసే విధానం :-

  • క్యారట్ ,బీన్స్ ,వంకాయ ,ఆలుగడ్డ బాగా కడిగి ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఒక గ్లాసు బియ్యం, పెసరపప్పు కడిగి నానపెట్టి పెట్టుకోవాలి.
  • స్టౌ వెలిగించి కుక్కర్ పెట్టి పచ్చి మిర్చి నాలుగు, క్యారట్ ముక్కలు,బీన్స్ ముక్కలు, వంకాయ ముక్కలు , బఠాణీలు,ఆలుగడ్డ ముక్కలు , తగినంత ఉప్పు,సరిపడా నీళ్లు, ఒక కప్పు బియ్యం తీసుకుంటే ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి.
  • అన్ని కుక్కర్ లో వేసి ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి .
  • ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.
  • నూనె వేడయ్యాక జీలకర్ర,మిరియాలు,వాము ,కరేపాకు, పసుపు ,ఇంగువ వేసి వేయించుకొని పోపుని ఖిచిడీలో వేసి బాగా కలుపుకోవాలి.
  • వేసి వేడి గా తింటే చాలా బాగుంటుంది.

తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి.


Also read: అల్లం టీ/Ginger Tea / Green Tea

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️