హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
అందరికీ నమస్కారం.
సెనగపప్పు ఆలూ వడ:-
వడ అంటే ఎప్పుడు మనం మినపప్పు తో చేస్తూ ఉంటాం. ఈరోజు మనం వెరైటీగా సెనగపప్పు ఆలూ వడ తయారు చేసే విధానం నేర్చుకుందాం.వడలు చాలా చాలా రుచిగా ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ.
కావలసిన పదార్ధాలు:-
పొటాటో పావుకేజీ
శనగపప్పు పావు కేజీ
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
చిన్న అల్లం ముక్క
నూనె తగినంత
కొద్దిగా పుదీనా
పచ్చిమిర్చి కొద్దిగా
కొత్తిమీర
కరేపాకు
ధనియాల పొడి
వాము
జీలకర్ర
తయారు చేసే విధానం :-
- శనగపప్పు తీసుకొని కడిగి 3 గంటల సేపు నానబెట్టుకోవాలి.
- బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో వేసి ఉడికించుకోవాలి.
- ఉడికిన బంగాళాదుంపను చేతితో మెత్తగా చిదుముకోనీ పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పును నీళ్ళు మొత్తం తీసి మిక్సీలో వేసి అందులో పచ్చిమిర్చి,అల్లం,ఉప్పు, కర్వేపాకు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- సగం పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. మిగతా సగం పెట్టుకుని బరకగా రుబ్బుకోవాలి.
- ఒక గిన్నెలోకి రుబ్బిన సెనగపప్పు, బంగాళదుంప ముద్దను కూడా వేసి రెండింటిని బాగా కలుపుకోవాలి.
- అందులో కొత్తిమీర,పుదీనా, పసుపు చిటికెడు ధనియాల పొడి, వాము, జీలకర్ర వేసి గారెల పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి.
- స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రై కి నూనె పోసి వేడి చేసుకోవాలి.
- నూనె వేడి అయిన తర్వాత గారెల పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
- స్వీట్ సాస్తో కాని చట్నీతో గానీ అల్లం చట్నీ టమాటా చట్నీ కానీ నీతో తీసుకున్నా కూడా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
- అంతే రుచికరమైన పొటాటో వడ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: రొయ్యల వేపుడు / prawns fry
Post a Comment
If you have any doubts, Please let me know.