హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
వెజిటేబుల్స్, మొలకెత్తిన గింజల సలాడ్..
సలాడ్ అంటే ఎప్పుడు మనం ఫ్రూట్స్ తో చేస్తూ ఉంటాం.ఈరోజు మనం వెరైటీగా స్ప్రౌట్స్ వెజిటేబుల్ సలాడ్ తయారు చేసే విధానం నేర్చుకుందాం. సలాడ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.చాలా రుచిగా ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.
కావలసిన పదార్థాలు:-
పెసలు
శనగలు
కందులు
కీరదోసకాయ
ఉల్లిపాయ
టమాటో
మిరియాలపొడి
చిటికెడు ఉప్పు
కొత్తిమీర
నిమ్మరసం
తయారు చేసే విధానం:-
- మొలకెత్తిన గింజలు వెజిటేబుల్ సలాడ్ చేయడానికి ముందుగా కూరగాయలు కడిగి పెట్టుకోవాలి.
- కందులు ,పెసలు ,శనగలు బాగా కడిగి ముందు రోజు నానబెట్టుకోవాలి.
- రేపు మనం సెలెక్ట్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు ఉదయాన్నే సెనగలు, కందులు, పెసలు నానపెట్టి పెట్టుకోవాలి.
- నాన పెట్టుకున్న సెనగలు కందులు పెసలు రాత్రి అందులో ఉన్న నీళ్ళు తీసి ఒక కాటన్ బట్టలో మూటకట్టి పెట్టుకోవాలి.
- మూట కట్టినా తెల్లవారేసరికి మొలకలు వస్తాయి మొలకలను తీసి ఒక గిన్నెలో పోసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు కూరగాయలు అన్ని మనకు కావలసిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి.
- తర్వాత మొలకలు కూరగాయలు అన్నీ ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి.
- అందులో చిటికెడు ఉప్పు,కొద్దిగా మిరియాలపొడి,కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
- అంతే స్ప్రౌట్స్ వెజిటేబుల్ సలాడ్ రెడీ. మంచిది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: అల్లం టీ/Ginger Tea / Green Tea
Post a Comment
If you have any doubts, Please let me know.