హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
మనం చాలా రకాల టిఫిన్ లు రెడీ తయారు చేసుకుంటూ ఉంటాం. మనం ఇడ్లీ, దోస ,వడ,పూరి,ఎలా చాల రకాల టిఫిన్ లు చేసుకుంటాం కానీ ఈరోజు మనం వెరైటీగా కేరళ స్పెషల్, ఫేమస్ టిఫిన్ కేరళ అప్పం తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది. అందరు చాలా ఇష్టపడతారు ..తప్పకుండా ప్రయత్నించండి....
కావలసిన పదార్థాలు:-
బియ్యం
ఉప్పుడు బియ్యం (ఇడ్లీ బియ్యం)
చెక్కర ఒక స్పూన్
ఉప్పు రుచికి తగినంత
ఈస్ట్ ఒక స్పూన్
కొబ్బరిపాలు ఒక గ్లాసు
తాటి కల్లు ఒక గ్లాసు
తయారు చేసే విధానం:-
- బియ్యం రెండు గ్లాసులు కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇడ్లీ బియ్యం కూడా కడిగి నానపెట్టుకోవలి.
- ఒక ఆరు గంటలు నానిన తర్వాత మిక్సి జార్ లో నానబెట్టుకొని బియ్యం,నానబెట్టుకొన్న ఇడ్లీ బియ్యం వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా చెక్కర, ఉప్పు, ఈస్ట్ వేసి కలిపి మిక్సి జార్ లో కొన్ని నీళ్ళు పోసి మరోసారి మిక్సీ పట్టి చాలా మెత్తగా పిండిలా చేసుకోవాలి.
- ఆ మిశ్రమాన్ని రెండు రోజులు పులియబెట్టుకోవాలి.
- ఇంకొక పద్దతి లో కూడా అప్పం పిండి చేసుకోవచ్చు మెత్తగా రుబ్బి పెట్టుకున్న పిండిలో తాటి కల్లు పోసి రెండు రోజుల పాటు పులియ పెట్టాలి.
- తరువాత అలా పులియబెట్టుకొన్న పిండిలో కొంచెం కొబ్బరిపాలు కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఉల్లిపాయ రుద్దుకొని టిష్యూ పేప, తుడుచుకొని తరువాత ఆప్పం పిండి వేసి ఆ పిండిని చట్టి మొత్తం వచ్చేలా పరుచుకుని వేడి మూత పెట్టి ఒకవైపు కాల్చుకుంటే అప్పం రెడీ. అప్పం ఇంకా వెజిటబుల్ స్టూ మంచి కాంబినేషన్. పల్లి చట్నీ ,కండి పచ్చడి చాలా మంచి కాంబినేషన్ .
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: పన్నీర్ 65 / paneer 65
Post a Comment
If you have any doubts, Please let me know.