హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
మిర్చిమసాలాకర్రీ:-
మనం చాలా రకాల వంటలు తయారు చేసుకుంటూ ఉంటాం. మనం ఇంట్లో చాల రకాల రైస్ వెరైటీ వంటలు చేసుకుంటాం . అవి పులావ్, వెజ్ పులావ్ ,వెజ్ బిర్యానీ ...అయితే ఈరోజు వాటికీ కాంబినేషన్ గ్రేవీ కర్రీ హోటల్ స్టైల్ మిర్చి మసాలా గ్రేవీ కర్రీ తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది. అందరు చాలా ఇష్టపడతారు. తప్పకుండా ప్రయత్నించండి.... స్పెషల్ మిర్చి మసాలా కర్రీ ఉంటె చాలు బిర్యానీ రుచి ఇంకా పెరుగుతుంది.కదా..
కావాల్సిన పదార్ధాలు:-
నూనె పావు కప్పు
కారం రుచికి తగినంత
ధనియాలు ఒక స్పూన్
సాల్ట్ రుచికి తగినంత
గసగసాలు రెండు స్పూన్ లు
నువ్వులు నాలుగు స్పూన్ లు
ఆవాలు కొద్దిగా పోపు కి
ఎండు కొబ్బరి పొడి రెండు స్పూన్ లు
వేయించిన జీలకర్ర పొడి అర చెంచ
పల్లీలు పావు కప్పు
ఉల్లిపాయ ముక్కలు
ఎండు మిర్చి రెండు
జీలకర్ర కొద్దిగా పోపు కి
అల్లం వెల్లులి పేస్ట్ ఒక పెద్ద స్పూన్
గరం మసాలా అర చెంచ
కరివేపాకు
పసుపు కొద్దిగా
బజ్జి మిర్చి పది
చింతపండు ఒక నిమ్మకాయ సైజు
తయారు చేసే విధానం:-
- ముందుగా బజ్జి మిర్చి తీసుకోని కడిగి మధ్యలో చీలిక పెట్టి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి.
- అలాగే చింతపండు నానపెట్టి చింత పండు పులుసు తీసి పెట్టుకోవాలి.ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో మసాలా చేసుకోవడానికి కావలసిన అన్ని పదార్థాలు ఫ్రీ చేసుకోవాలి.ముందుగా పల్లీలు,నువ్వులు,గసగసాలు,ఎండు కొబ్బరి పొడి వేసి చిన్న మంట మిద బాగా ఫ్రీ చేసుకోవాలి.
- పక్కన పెట్టి చల్లర్చుకోవాలి.చల్లారిన తర్వాత మిక్సిజార్ లో వేసి చాలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మిద గిన్నె పెట్టుకొని వేడయ్యాక అందులో తగిననత నునే పోసుకొని అది వేడయ్యాక అందులో జిలకర ,ఆవాలు,ఎందు మిర్చి,సన్నగా తరిగిన ఉల్లిపాయలు,కరేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఉల్ల్లిపాయలు ఫ్రై ఐన తర్వాత అల్లం వెల్లులి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి రెండు నిమిషాల తర్వత బజ్జి మిర్చి వేసి కొద్దిగా మగ్గించాలి.
- రెండు నిమిషాల తర్వాత ఉప్పు,కారం,దనియాల పొడి,గరం మసాలా ,వేసి బాగా కలిపి చింతపండు పులుసు వేసి ఒక పది నిముషాలు నునె పైకి టెలి వరకు మరిగించాలి.
- మరిగిన తర్వాత తయారు చేసి పెట్టుకున మసాలా పేస్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి మీడియం మంట మీద నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
- నూనె పైకి తేలక బాగా కలిపి కొత్తిమిర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.అంతే రుచికరమైన మిర్చి క సాలన్ రెడీ.ఈ గ్రేవీ కర్రీ రైస్ వంటలలోకి చాల బాగుంటుంది.బిర్యానికి బెటర్ కాంబినేషన్ .
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Post a Comment
If you have any doubts, Please let me know.