హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం,
ఎప్పుడు బైట తయారు చేసే చిప్స్, స్నాక్స్ తిని, తిని బోర్ కొడుతుందా…... అయితే ఈరోజు మనం వెరైటీ స్నాక్ అనియన్ రింగ్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం…... ఆనియన్ రింగ్స్ టెస్ట్ సూపర్ గా ఉంటుంది…. కొంచెం స్పైసీ, కర కర లాడుతు ఉంటాయి…. అలాగే ఉల్లిపాయ తియ్యదనం తెలుస్తుంది.. పిల్లలు చాలా ఇష్టం గా తింటారు..తప్పకుండా ప్రయత్నించండి….
కావలసిన పదార్థాలు:-
రెండు పెద్ద ఉల్లిపాయలు
ఉప్పు తగినంత
ఆఫ్ కప్పు మైదాపిండి
కారం ఒక స్పూన్
మిరియాల పొడి కొద్దిగా
నీళ్లు కొద్దిగా
నూనె డీప్ ఫ్రై చేయడానికి
బ్రెడ్ క్రుంబ్స్ ( బ్రెడ్ పౌడర్ )
తయారు చేసే విధానం:-
- ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలు కడిగి అడ్డంగా రింగులా కట్ చేసి పెట్టుకోవాలి.
- కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను ఒక్కొక్క రింగు విడదీసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక గిన్నెలో మైదా పిండిని వేసి అందులో కొద్దిగా మిరియాల పొడి, తగినంత కారం, సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మనకు కావలిసిన విధంగా పిండి కలుపుకోవాలి.
- పిండి ని మనం రింగులో ముంచితే కోటింగ్ లా అంటుకునేల కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసుకుంటే రింగ్స్ సరిగా రావు.
- ఒక ప్లేట్ లో బ్రెడ్ పౌడర్ నీ రెడీ గా పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడి చేసుకోవాలి.
- నూనె వేడయ్యాక ఆనియన్ రింగ్స్ నీ మైదా పిండిలో ముంచి బ్రెడ్ పౌడర్ లో దొర్లించి నూనెలో వేసి ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
- అంతే యమ్మీ యమ్మీ ఆనియన్ రింగ్స్ రెడీ.. వీటికి కాంబినేషన్ స్వీట్ చట్నీ కానీ టొమాటో కెచప్ తో పాటు తింటే అదిరిపోతుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Post a Comment
If you have any doubts, Please let me know.