టమోటా మిరియాల రసం\ Tomato rasam

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.

 ఈరోజు స్పైసీ టమోటా రసం తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.జలుబు ,దగ్గు గా ఉన్నప్పుడు ఈ టమాటో రసం తో అన్నం ను తీసుకుంటే తొందరగా ఉపశమనం కలుగుతుంది.తప్పకుండ ట్రై చేయండి.

tomato rasam

కావలసిన పదార్థాలు:-

టొమాటో

చింతపండు

జీలకర్ర,

ఎండుమిర్చి

కరివేపాకు

కొత్తిమీర

ఉప్పు తగినంత

కారం

పసుపు

నూనె

మిరియాల పొడి

పచ్చిమిర్చి

వెల్లుల్లి

ఉల్లిపాయలు

ఒక స్పూన్ సెనగ పిండి

తయారు చేసే విధానం:-

  • ముందుగా టమాటాలు ఉడికించి రసం తీసి పెట్టుకోవాలి. అలాగే చింత పండు గుజ్జును తీసి పెట్టుకోవాలి.

  • ఇప్పుడు స్టౌ వెలిగించి గిన్నె లో నూనె పోసి వేడి చేసి అందులో జీలకర్ర ,ఎండుమిర్చి ,కరివేపాకు ,నాలుగు వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం తగినంత వేసి బాగా మరిగించాలి.

  • పది నిమిషాలు మరిగిన తర్వాత అందులో మిరియాల పొడి, కొత్తిమీర, సెనగ పిండి నీ నీళ్లలో కలిపి మరుగుతున్న రసంలో పోసి బాగా కలపాలి.

  • మరో ఐదు నిమిషాలు మరిగించి స్టౌ ఆఫ్ చేయాలి.

  • అంతే రుచికరమైన టొమాటో రసం రెడీ.

  • తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️