మామిడికాయ పులిహోర / Mango pulihora

హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.

మనం రకరకాలుగా పులిహోరలు చేసుకుంటుంటాం.

ఈరోజు నోరూరించే ఘుమ ఘుమలాడే మామిడికాయ పులిహోర తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.

mango rice

కావలసిన పదార్థాలు :

ఉడికించిన అన్నం

మామిడికాయ తురుము

నూనె

జిలకర

ఆవాలు

ఎండుమిర్చి నాలుగు

పచ్చిమిర్చి

కరేపాకు

సెనగపప్పు

మినపప్పు

పల్లీలు

పసుపు

తగినంత ఉప్పు

 

తయారు చేసే విధానం :-

  • అన్నం ఉడికించి పొడి పొడిగా చేసుకొని కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి.
  • మామిడికాయను తురిమి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసుకొని అందులో జిలకర ,ఆవాలు,ఎండుమిర్చి నాలుగు ,పచ్చిమిర్చి ,కరేపాకు ,పల్లీలు,సెనగపప్పు ,మినపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి.
  • వేగిన తర్వాత పసుపు వేసుకొని మామిడికాయ తురుము వేసి ఒక నిమిషం ఉంచి కలిపి స్టౌ ఆఫ్ చేసుకొని ఉడికిన అన్నంలో వేసి మంచిగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి .
  • అంతే ఘుమ ఘుమలాడే మామిడికాయ పులిహోర రెడి.

తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️