శనగల గోంగూర మసాలా కూర / sanagala gongura masala kura

హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.

ఈరోజు ఎంతో రుచికరమైన శనగల గోంగూర కూర తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.

sanagala gongura masala kura

కావలసిన పదార్థాలు :-

శెనగలు (కాబూలీ శెనగలు )

గోంగూర

పోపు దినిసులు

లవంగాలు

యాలకులు

మిరియాలు

ధనియాలు

ఎండుమిర్చి

జిలకర

వాము

కారం

ఉప్పు

నూనె

కొత్తిమీర

నీళ్లు

పసుపు

ఉల్లిపాయలు

అల్లంవెల్లుల్లిపేస్ట్

తయారు చేసే విధానం:-

  • ముందుగా శెనగలను కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మసాలా కోసం లవంగాలు ,యాలకులు,ధనియాలు ,ఎండుమిర్చి ,జిలకర ,వాము అన్ని కొద్దీ కొద్దిగా తీసుకోవాలి.అంటే మనం వండే కూరకు సరిపడా తీసుకోని వేయించి పొడిచేసుకొని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి పోపు దినిసులు ,ఉల్లిపాయలు వేసి ఎర్రగా అయ్యేవరకు వేయించి అల్లంవెల్లుల్లిపేస్ట్, పసుపు వేయాలి .
  • తర్వాత కట్ చేసుకున్న గోంగూర ని వేయి కాసేపు మగ్గించాలి.
  • ఇప్పుడు ఉడికించుకున్న శెనగలు వేయాలి. రెండు నిమిషాల తరువాత మనం తయారు చేసుకున్న మసాలా వేయాలి .
  • ఇప్పుడు ఒక ఐదు నిముషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.తర్వాత కారం కొద్దిగా వేసుకోవాలి ముందు మసాలా లో ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి అలాగే ఉప్పు తగినన్ని నీళ్లు పోసి పది నిముషాలు ఉడికించుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేసుకోవాలి అంతే శనగల గోంగూర మసాలా కూర రెడీ .
  • ఇది చపాతీ ,పూరి ,అన్నం లో కి చాల సూపర్ గా ఉంటుంది.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.



0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️