హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా కర్రీలు చేసుకుంటుంటాం.
ఈరోజు వెరైటీ బూంది కర్రీ తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు :-
నూనె
పచ్చిమిర్చి
ఉల్లిపాయలు
టమోటో
కొత్తిమీర
కరేపాకు
అల్లంవెల్లుల్లిపేస్ట్
పసుపు
జీలకర్రపొడి
కొబ్బరిపొడి
పెరుగు
కారం
ఉప్పు
నీళ్లు
బూందీ
తయారు చేసే విధానం :-
- బూంది కర్రీ చేసుకోవడానికి ముందుగా బూంది తయారుచేసుకోవాలి. లేకపోతే బైట షాప్ లో తేచుకున్న పర్వాలేదు .
- స్టౌ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు, కరేపాకు, అల్లంవెల్లుల్లిపేస్ట్, పసుపు వేసి బాగా వేయించుకోవాలి.
- ఇప్పుడు టమోటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.టొమాటోలు వేగిన తర్వాత తగినంత కారం, ఉప్పు, జీలకర్రపొడి, కొబ్బరిపొడి వేయాలి.
- రెండు నిమిషాల తర్వాత బూందీ వేసి కలుపుకోవాలి.ఇప్పుడు చివరగా పెరుగు కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి.
- ఇంకో ఐదు నిముషాలు స్టౌ మీద ఉడికినతర్వాత కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే వెరైటీ బూంది కర్రీ రెడి.
తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.