హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా దోశ లు చేసుకుంటుంటాం.
ఈరోజు వెరైటీ రుచికరమైన టమాటో దోశ తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు :
బియ్యం
జిలకర
పచ్చిమిర్చి
ఉప్పు
అల్లం
వెల్లుల్లి
నూనె
టమేటా
మినప్పప్పు
కొత్తిమీర
తయారు చేసే విధానం :-
- ముందుగా బియ్యం మినప్పప్పు ని నానపెట్టి దోసల పిండి రుబ్బుకొని పెట్టుకోవాలి
- దోసల పిండి లో టమాటో పేస్ట్ , జిలకర, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి.
- అందులో ఉప్పు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు,సన్నగా తరిగిన కొత్తిమీర వేసి పిండిని చక్కగా కలుపుకోవాలి.
- ఇప్పుడు రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టౌ వెలిగించి పెనం పెట్టి దోశలు వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.అంతే ఎంతో రుచికరమైన టమాటో దోశ రెడి.చట్నీ తో గాని చట్నీ లేకున్నా ఈ దోస చాల రుచిగా ఉంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: బూంది కర్రీ / Boondhi Curry
Post a Comment
If you have any doubts, Please let me know.