హాయ్ ప్రెండ్స్,
ఈరోజు గార్లిక్ పొటాటో ఫ్రై తయారు చేసుకుందాం.
ఇది పప్పు చారు రసం లో కి చాలా రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:-
ఆలూ
వెల్లుల్లి తరుగు
నూనె
ఉప్పు
కారం
తయారు చేసే విధానం:-
- ముందుగా ఆలూ కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- వెల్లుల్లి తరుగు సిద్దం చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆలూ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత అన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో వెల్లుల్లి తరుగు, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
- అంతే రుచికరమైన పొటాటో గార్లిక్ ఫ్రై రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: గోధుమ రవ్వ దోశ
Post a Comment
If you have any doubts, Please let me know.