హాయ్ ప్రెండ్స్,
ఈరోజు మనం బయిట దొరికే మిర్చి లాంటి టెస్ట్ తో మిర్చి తయారు చేసే విధానం నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు:-
మిర్చి
ఉప్పు
కారం
చిటికెడు పసుపు
కొద్దిగా వంట సోడా
సెనగపిండి
కొద్దిగా బియ్యం పిండి
నీళ్లు
నిమ్మరసం
ఉల్లిపాయలు
కొత్తిమీర
తయారు చేసే విధానం:-
- ఒక గిన్నలోకి నిమ్మరసం ఉప్పు కలుపుకోవాలి.
- ముందుగా మిర్చి నీ రెండుగా చీల్చి అందులో గింజలు తీసి నిమ్మరసం, ఉప్పు కలిపిన మిశ్రమం మిరపకాయల మద్యలో రాసుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో శెనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, ఉప్పు, కారం తగినంత, చిటికెడు పసుపు, వంట సోడా,తగినన్ని నీళ్ళు పోసి పిండి సిద్దం చేసుకోవాలి.
- పిండి మరీ జారుడుగా ఉండకూడదు.
- ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం ఒక గిన్నెలో కలిపి పెట్టుకోవాలి.
- స్టౌ వెలిగించి కళాయి లో నూనె వేడి చేసి అందులో మిరపకాయలను పిండిలో ముంచి బజ్జీలు వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి.
- ఇప్పుడు కాల్చుకున్న బజ్జీలను మధ్యలో కట్ చేసి అందులో ఉల్లిపాయలను పెట్టుకొని తింటే అదిరిపోతుంది.
- అంతే వేడి వేడి బజ్జీలు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.