హాయ్ ప్రెండ్స్,
బెండకాయ పచ్చి మిర్చి ఫ్రై నేను చేశాను మీరు ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు:-
బెండకాయలు
పచ్చి మిర్చి
ఉల్లిపాయలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు చిటికెడు
ఉప్పు రుచికి తగినంత
కారం తగినంత
కొత్తిమీర
ధనియాల పొడి
జీలకర్ర
కరివేపాకు ఆకు
నూనె
తయారు చేసే విధానం:-
- బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, కరేపాకూ, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసి అందులో పచ్చి మిర్చి ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
- పది నిమిషాల పాటు ఫ్రై చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్,పసుపు,బెండకాయ ముక్కలు ఒక్కోటి చొప్పున వేసి కలిపి మూత పెట్టీ బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఇంకో పది నిమిషాలకి అందులో కారం తగినంత, ఉప్పు రుచికి సరిపడా ,కొత్తిమీర,ధనియాల పొడి వేసి బాగా మగ్గించాలి.
- అంతే రుచికరమైన బెండకాయ పచ్చి మిర్చి ఫ్రై రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: చిన్న పిల్లలకు చిప్స్ /chips for kids
Post a Comment
If you have any doubts, Please let me know.