హాయ్ ప్రెండ్స్,
క్యాబేజ్ కర్రీ చేసుకునేటప్పుడు బాగా వాసన వస్తుంది.
వాసన రాకుండా ఉండాలంటే డైరెక్ట్ గా వండుకోవాలి. అలా ఐతే వాసన చాలా తక్కువ వస్తుంది.
కావలసిన పదార్థాలు:-
క్యాబేజ్
ఉల్లిపాయలు
సెనగపప్పు
ఎండుమిర్చి
జీలకర్ర
కరివేపాకు
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు చిటికెడు
ఉప్పు రుచికి తగినంత
కారం
కొత్తిమీర
ధనియాల పొడి
తయారు చేసే విధానం:-
- ముందుగా క్యాబేజ్, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండు మిర్చి ముక్కలు, కారేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి.
- ఫ్రై ఐన తర్వాత అందులో క్యాబేజ్ వేసి కలిపి మూత పెట్టీ మూత పైన నీళ్లు పెట్టుకోవాలి.
- లోతుగా ఉన్న మూత పెట్టుకోవాలి.
- ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి అందులో శెనగపప్పు వేసుకోవాలి.
- ఇప్పుడు మళ్లీ మూత పెట్టీ బాగా మగ్గించాలి.
- మగ్గిన తరువాత అందులో తగినంత ఉప్పు, కారం కొత్తిమీర, ధనియాల పొడి వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి.
- అంతే టేస్టీ క్యాబేజ్ సెనగపప్పు కూర రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి
Also read: బెండకాయ పచ్చి మిర్చి ఫ్రై
Post a Comment
If you have any doubts, Please let me know.