క్యాప్సికమ్ రైస్

హాయ్ ప్రెండ్స్,
ఈరోజు మనం క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకుందాం.

కావలసిన పదార్థాలు:-

ఉడికించిన అన్నం
నూనె
జీలకర్ర
ఆవాలు
కరివేపాకు
కొత్తిమీర
నిమ్మరసం
ఉప్పు 
కారం 
పసుపు
క్యాప్సికమ్ ముక్కలు
వెల్లుల్లి తరుగు
ఉల్లిపాయ ముక్కలు
ధనియాల పొడి
గరం మసాలా
పచ్చిమిర్చి తరుగు
టొమాటో సాస్

తయారు చేసే విధానం:-

  • ముందుగా స్టౌ వెలిగించి పాన్ లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొన్న క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఇప్పుడు ఉడికించిన అన్నం వేసి బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి.
  • కొద్దిగా వేడయ్యాక అందులో సాస్, కొద్దిగా కొత్తిమీర వేసి దించేయాలి.
  • అంతే రుచికరమైన క్యాప్సికమ్ రైస్ రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️