పాలక్ పన్నీర్

హాయ్ ప్రెండ్స్,
ఈరోజు చాలా ఇష్టమైన పాలక్ పన్నీర్ తయారు చేసుకుందాం.

palak paneer

కావలసిన పదార్థాలు:-

పాలకూర
పన్నీర్ ముక్కలు
ఉల్లిపాయ ముక్కలు
నూనె
పచ్చి మిర్చి
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు చిటికెడు
కారం
ఉప్పు
ధనియాల పొడి
గరం మసాల

తయారు చేసే విధానం:-

  • ముందుగా స్టౌ మీద గిన్నె లో నీళ్ళు వేడి చేసుకొని అందులో పాలకూర ఒక ఐదు నిమిషాలు ఉంచి మిక్సి లో వేసి పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి.
  • పనీర్ ముక్కలు నూనె లో ఫ్రై చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి లో నూనె పోసి కాగాక అందులో జీలకర్ర , పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వేసి బాగా ఫ్రై చేసి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి.
  • ఇప్పుడు అందులో తగినంత కారం, ఉప్పు, ధనియాలపొడి,గరంమసాలా వేసి పది నిమిషాలు మగ్గించాలి.
  • ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలు వేసి రెండు నిముషాలు ఆగి స్టౌ ఆఫ్ చేయాలి.
  • అంతే పాలక్ పన్నీర్ రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️