హాయ్ ప్రెండ్స్,
ఈరోజు క్రీస్పి మైసూర్ బోండా తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
మైదా పిండి
బియ్యం పిండి
ఉప్పు
పచ్చి మిర్చి ముక్కలు
ఉల్లిపాయ ముక్కలు
వంట సోడా చిటికెడు
నూనె డీప్ ఫ్రై కి సరిపడా
తయారు చేసే విధానం:-
- ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వంట సోడా వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు కొద్దీ కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి.
- ఒకే సారి నీళ్లు పోస్తే ఉండలు కడతాయి.
- ఉండలు లేకుండా ఒక పావు గంట సేపు కలపాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడి చేయాలి.
- ఇప్పుడు బోండాలు వేసుకోవాలి.
- వీటిని రెండూ వైపుల ఎర్రగా కాల్చుకోవాలి.
- అంతే రుచికరమైన క్రిస్పి మైసూర్ బోండా రెడీ
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: సొరకాయ గారెలు
Post a Comment
If you have any doubts, Please let me know.