హాయ్ ప్రెండ్స్,
ఈరోజు వెరైటీగా దొండకాయ మసాలా కర్రీ తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
దొండకాయ ముక్కలు
పచ్చిమిర్చి
అల్లం వెల్లుల్లి పేస్ట్
కొత్తిమీర
ఉప్పు
పసుపు
కారం తగినంత
నూనె
నువ్వులు
పెరుగు
పోపు గింజలు
ఉల్లిపాయ ముక్కలు
టొమాటో ముక్కలు
గరం మసాలా
తయారు చేసే విధానం:-
- ముందుగా దొండకాయలు లేతగా సన్నగా ఉన్నవి తీసుకోవాలి.
- ఇప్పుడు వాటిని కడిగి వంకాయలు మసాలా కి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి కాగాక అందులో దొండకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు అందులో ఇంకొంచెం నూనె పోసి పోపు గింజలు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత అందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు చిటికెడు వేసి కలిపి అందులో టొమాటో ముక్కలు వేసి మూత పెట్టీ మగ్గించాలి.
- ఇప్పుడు ఇంకో స్టౌ మీద నువ్వులు రెండు స్పూన్లు ఫ్రై చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు నువ్వులు, కారం, ఉప్పు, పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- టమాటాలు మగ్గిన తర్వాత అందులో దొండకాయ ముక్కలు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి అందులో మనం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టీ బాగా ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని కలుపుతూ ఉండాలి.
- నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి.
- చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
- అంతే రుచికరమైన దొండకాయ మసాలా కర్రీ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: క్రిస్పీ మైసూర్ బోండా
Post a Comment
If you have any doubts, Please let me know.