హాయ్ ప్రెండ్స్,
ఈరోజు కాకరకాయ వెల్లుల్లి వేపుడు తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
కాకరకాయలు
నూనె
ఎండు మిర్చి
ఉల్లిపాయ ముక్కలు
జీలకర్ర
కరివేపాకు
వెల్లుల్లి తరుగు
పసుపు చిటికెడు
కారం
ధనియాల పొడి
ఉప్పు తగినంత
కొత్తిమీర
తయారు చేసే విధానం:-
- ముందుగా కాకరకాయ ని పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండు మిర్చి, కరిపాకు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్న కాకరకాయ ముక్కలను వేసి కలిపి మూత పెట్టీ ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి..
- ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలర్ మారే వరకూ ఫ్రై చేసుకోవాలి.
- అంతే రుచికరమైన కాకరకాయ వెల్లుల్లి వేపుడు రెడీ.
- ఇది వేడి వేడి అన్నం లోకి చాలా బాగుంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: దొండకాయ మసాలా కర్రీ
Post a Comment
If you have any doubts, Please let me know.