సొరకాయ గారెలు

హాయ్ ప్రెండ్స్,
ఈరోజు సొరకాయ తో గారెలు తయారు చేసుకుందాం.


కావలసిన పదార్థాలు:-

బియ్యం పిండి
ఉప్పు తగినంత 
నూనె సరిపడా
కొత్తిమీర
అల్లం వెల్లుల్లి పేస్ట్
సొరకాయ తురుము
పసుపు
సెనగపప్పు
కారం
జీలకర్ర
కారెపాకు

తయారు చేసే విధానం:-

  • ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టౌ వెలిగించి వేడిచేయాలి
  • ఇప్పుడు అందులో జీలకర్ర, పసుపు చిటికెడు, కారం ఉప్పు రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సెనగపప్పు, కరెపాకూ వేసి కలుపుకోవాలి.
  • స్టౌ ఆఫ్ చేసి నీళ్ళు పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పిండి,సొరకాయ తురుము, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు అందులో వేడి నీళ్లను కొద్ది కొద్దిగా పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  • ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని కవర్ పైన కానీ పూరి ప్రెస్ లో కాని గారెలు చేసుకోవాలి.
  • స్టౌ వెలిగించి ఫ్రై చేసుకోవడానికి కడాయి లో నూనె వేడి చేసి అందులో గారెలు వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి.
  • అంతే రుచికరమైన సొరకాయ గారెలు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️