హాయ్ ప్రెండ్స్,
ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా చెయ్యాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:-
ఆలుగడ్డ
బీన్స్
క్యారట్
టొమాటో
ఉల్లిపాయలు
బఠాణీ
కొత్తిమీర
కరేపాకు
వెల్లుల్లి రెబ్బలు
కారం
ఉప్పు రుచికి తగినంత
పసుపు చిటికెడు
తయారు చేసే విధానం:-
- ఆలూ, బీన్స్,బఠాణీ, క్యారట్ అన్ని ముందుగా ఉడికించి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి లో నూనె వేసి కాగాక అందులో పోపు గింజలు వేసి ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు అందులో వెల్లుల్లి తరుగు, పసుపు వేసి ఒక నిముషం తర్వాత అందులో టొమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్, కారం, ఉప్పు తగినంత వేసి కొద్దిగా నీళ్ళు పోసి బాగా మగ్గించాలి.
- చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
- అంతే రుచికరమైన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: టొమాటో నువ్వుల పచ్చడి
Post a Comment
If you have any doubts, Please let me know.