హాయ్ ప్రెండ్స్,
ఈరోజు మనం పుదీనా పచ్చడి చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
పుదీనా
టొమాటో ముక్కలు
పచ్చి మిర్చి ముక్కలు
జీలకర్ర
పల్లీలు
నువ్వులు
నూనె
కరెపకూ
ఎండు మిరపకాయలు
శెనగ పప్పు
మినప పప్పు
పసుపు
ఉప్పు రుచికి తగినంత
తయారు చేసే విధానం:-
- స్టౌ వెలిగించి పాన్ లో పల్లీలు, నువ్వులు ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత అందులో కొద్దిగా నూనె వేసి టొమాటో ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- అవి పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత అందులో పుదీనా ఆకులు వేసి బాగా మగ్గించాలి.
- ఇప్పుడు మిక్సి జార్ లో వేసి ఫ్రై చేసిన టొమాటో ముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు,పుదీనా, నువ్వులు, పల్లీలు అన్ని వేసి కావలసిన విధంగా మిక్సి పట్టాలి.
- ఇప్పుడు పోపు కోసం చిన్న కడాయి పెట్టీ నూనె పోసుకొని జీలకర్ర,ఎండుమిర్చి, కరిపాకూ, మినపప్పు, సెనగపప్పు,పసుపు వేసి పోపు పచ్చడిలో కలపాలి.
- అంతే రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి
Also read: ఉతప్పం
Post a Comment
If you have any doubts, Please let me know.