హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు వెరైటీ గా టమాటో కోడిగుడ్డు గ్రేవీ తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
కోడి గుడ్లు
టొమాటోలు
ఉల్లిపాయలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు చిటికెడు
ఉప్పు రుచికి సరిపడా
కారం తగినంత
కొత్తిమీర
ధనియాల పొడి
జీలకర్ర
ఎండు మిర్చి ముక్కలు
ఎండు కొబ్బరి పొడి
నీళ్ళు
నూనె
కరెపాకు
తయారు చేసే విధానం:-
- ముందుగా టొమాటో, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర,ఎండు మిర్చి,కర్పాకు ,ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- అవి ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి ఫ్రై చేసి అందులో టొమాటో ముక్కలు వేసి బాగా మగ్గించాలి.
- మగ్గిన తర్వాత అందులో కారం, ఉప్పు, వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
- ఆ నీళ్ళు మరిగిన తర్వాత అందులో గుడ్లు కొట్టి పోసి స్టౌ మంట తక్కువ పెట్టుకొని మూత పెట్టీ ఒక ఐదు నిమిషాలు అడుగు అంటకుంట నెమ్మదిగా గుడ్లు విడిపోకుండా కలుపుకోవాలి.
- మరో ఐదు నిమిషాల తర్వాత అందులో ధనియాల పొడి, కొత్తిమీర, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి.
- మనకు కావలసిన గ్రేవీ చిక్కగా వచ్చేవరకు ఉడికించాలి.
- అంతే రుచికరమైన కోడిగుడ్డు టమాటా గ్రేవీ రెడీ.
you also may like: మల్టీ కలర్ దోశ
Post a Comment
If you have any doubts, Please let me know.