ఉలవచారు

హాయ్ ప్రెండ్స్,
ఈరోజు వెరీ హెల్తీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీ ఉలవచారు చేసుకుందాం.

ulavacharru

కావలసిన పదార్థాలు:-

ఉలవలు
చింత పండు గుజ్జు
ఉప్పు
కారం
పసుపు
ధనియాల పొడి
జీలకర్ర
ఎండు మిరపకాయలు 
ఉల్లిపాయ ముక్కలు 
పచ్చిమిర్చి 
కొత్తిమీర

తయారు చేసే విధానం:-

  • ఉలవలను ముందు రోజు రాత్రి నానపెట్టుకోవలి.
  • ఇప్పుడు ఉలవలు కుక్కర్లో వేసి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
  • ఉడికిన తర్వాత ఉలవలు పక్కన పెట్టుకోవాలి.
  • నీళ్లు ఒక గిన్నెలో పోసుకొని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె పోసి కాగాక అందులో జీలకర్ర, ఎండు మిర్చి ముక్కలు ,ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, కరేపాకు అన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు చిటికెడు పసుపు, చింత పండు గుజ్జును, ఉప్పు తగినంత, కారం వేసి మరిగించాలి.
  • ఒక పొంగు రాగానే ఉలవల నీళ్లు పోసి కలిపి ఒక పదిహేను నిమిషాలు బాగా మరిగించాలి.
  • మరిగిన తరువాత అందులో చివరగా కొత్తిమీర,ధనియాల పొడి వేసి దించేయాలి.
  • అంతే రుచికరమైన ఉలవచారు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️